హైదరాబాద్ : ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 111 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కేసులు గుర్తించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 5 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఏపీలో ఇప్పటిదాకా 7,152 మంది కరోనాతో కన్నుమూశారు.
Mon Jan 19, 2015 06:51 pm