హైదరాబాద్ : పీఆర్సీ సిఫార్సులపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పే-రివిజన్ కమిటీ రిపోర్టుపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పే-రివిజన్ కమిటీ విశ్వసనీయతలేనిదని అన్నారు. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పినప్పుడు ఉద్యోగులకు ఫిట్ మెంట్ 7.5శాతం నిర్ణయించడం దేనికి సంకేతం. పెరుగుదల ధరలను దృష్టిలో ఉంచుకుని కమిటీ నివేదిక అందించాలి.