హైదరాబాద్ : చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం వికలాంగుల ఉద్యమించాలని, పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఎన్పిఆర్డి క్యాలెండర్ ఆవిష్కరణలో వక్తలు విమర్శించారు. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో 2021 నూతన సంవత్సరం క్యాలెండర్ను హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల అధినేత పటాన్ ఉమ్మార్ ఖాన్,ఎన్పిఆర్డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్, ఏం అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి నాగలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు బాలయ్య ,రంగారెడ్డి, షైన్ బేగంలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమర్శించారు. చట్టాల గురించి అవగాహన కల్పించడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. వికలాంగుల పట్ల సమాజంలో చిన్నచూపు వివక్షత కొనసాగుతుందని అన్నారు. విద్యా ఉద్యోగాల్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. వికలాంగుల విద్య పట్ల పాలకులకు చిత్తశుద్ధి ఉంటే బ్రెయిలీ, సైన్ లాంగ్వేజ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరైన పాఠశాల లేకపోవడం ద్వారా వికలాంగుల నిరక్షరాస్యత పెరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివేందుకు వికలాంగులకు తగిన విద్యాసంస్థలు లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా వికలాంగుల సంక్షేమం కోసం ఉన్న అనేక చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ,ఎన్ ఐ వి హెచ్ ,ఆర్ సి ఐ చట్టాలకు సవరణలు చేయాలని కేంద్ర నిర్ణయించిందని దీని ద్వారా వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల్లో వికలాంగులకు న్యాయమైన వాటా దక్కడం లేదని అన్నారు. ప్రభుత్వ పథకాలు వికలాంగులకు చేరే విధంగా ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సహాయం పొందుతున్న ప్రైవేట్ సంస్థలన్నీ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ వికలాంగులకు నిరుద్యోగ భృతిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఎలాంటి షరతులు లేకుండా 5లక్షల వరకు ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 05:47PM