హైదరాబాద్ : నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత రెండు నెలల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసులు రైతులపై లాఠీఛార్జ్ చేయడంతో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా రైతులకు మద్దతుగా హర్యానాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రైతుల ఆందోళనకు సంఘీభావంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఇండియన్ నేషనల్ లోక్‌దల్ (ఐఎన్ఎల్‌డీ) నాయకుడు అభయ్‌సింగ్ చౌతలా తెలిపారు. ఆయన రాజీనామాకు హర్యానా అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm