హైదరాబాద్ : ఈ ఏడాది నిర్వహించనున్న ఐపీఎల్ వేలం తేదీ ఖరారైంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం జరగనుంది. దీనికి సంబంధించి ఐపీఎల్ ట్వీట్ చేసింది. కరోనా వల్ల గతేడాది ఎప్రిల్ లో జరగాల్సిన ఐపీఎల్ సెప్టెంబర్ లో జరిగింది. ఇక మళ్లీ ఈ ఏడాది మార్చి చివరి వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుందని సమాచారం. దీంతో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేగాక ఈ సారి రెండు కొత్త జట్లు బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm