బీజేపీ ఆర్థిక విధానాలు సంపన్నులను అత్యంత సంపన్నులుగా, పేదలను ఇంకా నిరు పేదలుగా మారుస్తున్నాయి. ఇది ప్రజల ప్రభుత్వం కాదని, బడా బాబుల ప్రభుత్వమని ఆక్స్‌ఫాం రిపోర్ట్ కూడా బహిర్గతం చేసింది. కుబేరులకు కేంద్రం ఏ విధంగా కొమ్ముకాస్తుందో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వెలువడిన ఈ లెక్కలు తేటతెల్లం చేస్తున్నవి. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా బడాబాబుల దోపిడీని అరికట్టాలని, సంపన్నులపై పన్నులు పెంచాలని, పేదలు-సంపన్నుల మధ్య అంతరాలు తగ్గించి, వారి జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ఈ యేడాది దేశంలోని 100 మంది కుబేరులు మరింత కుబేరులై 30శాతం సంపద పెంచుకున్నారు. లాక్‌డౌన్‌లో కూడా వీరి సంపద 12.97 లక్షల కోట్లు పెరిగినట్లు ఆక్స్‌పాం రిపోర్టు పేర్కొన్నది. కోవిడ్‌లో ముఖేష్‌అంబాని ఆదాయం గంటకు 90 కోట్ల చొప్పున పెరగగా, ఆదాని సంపద 7.2 లక్షల కోట్లు పెరిగింది. దీనినిబట్టి చూస్తే సంపన్నులు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారో గమనించవచ్చు.
కోవిడ్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కల్పోయ్యారు. మహిళల నిరుద్యోగిత రేటు 15శాతం పెరిగింది. పేదవారు మరింత పేదలైనారు. కోవిడ్‌లో ఒక్క వ్యవసాయ రంగమే ప్లస్ 3.5గా నమోదైతే దానిని కూడా ముంచడానికి కేంద్రం మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నది. కార్పొరేట్ల లాభం కోసమే ఇంతటి దుస్సాహానికి పాల్పడుతున్నది.
పేదరిక నిర్మూలన, ఉచిత విద్యా-వైద్యం, ఉపాధి, ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు తధితర ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపర్చుకున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కింది. ఇది అభివృద్ధి చెందుతున్న మన దేశానికి తీవ్ర నష్టదాయకమని సీపీఐ(ఎం) హెచ్చరిస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 04:12PM