హైదరాబాద్: టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి విమర్శించారు. ప్రజలు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని జగదీశ్ రెడ్డి అన్నారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ పురోగతిని కేంద్ర మంత్రులు సైతం ప్రశంసించారని తెలిపారు. నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరికొట్టామని వెల్లడించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే తమకు అడ్రస్ ఉండదని కేసులు వేసి అడ్డుకున్నారని చెప్పారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆ పార్టీ 300లకుపైగా కేసులు వేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ స్కాంల వల్లనే దేశం ఎంతో నష్టపోయిందని ఆరోపించారు. ప్రజలు కోరుకున్న దానికంటే రాష్ట్రంలో ప్రస్తుతం అద్భుతమైన పాలన జరుగుతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తాగునీటికి సమస్యలు ఉండేవని చెప్పారు. దేశంలో తెలంగాణ అన్నిరంగాల్లో నంబర్ 1గా ఉందని చెప్పారు. అధికార, అనధికార నివేదికలన్నీ ఇదే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదుకాలేదంటే అది మిషన్ భగీరథ విజయవంతం అనడానికి నిదర్శమని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధిని జీర్ణించుకోలేకనే కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ అవినీతి రంగు పులుముతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్థికవృద్ధిరేటులో 14.2 శాతంతో తెలంగాణ మూడోస్థానంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 01:11PM