హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ భారీ చిత్రం తాలుకా టీజర్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ ను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ నెల 29 (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm