అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ,అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ అధికారులతో సమీక్షిస్తున్నారు.
ఈ నెల 29 నుంచి తొలిదఫా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. నామపత్రాల దాఖలు కోసం ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా.. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఎస్‌ఈసీ సమాలోచనలు చేస్తున్నారు. అంతకుముందు గవర్నర్‌ను కలిసి ఎన్నికల నిర్వహణకు తీసుకుంటోన్న చర్యలను ఎస్‌ఈసీ, సీఎస్ విడివిడిగా కలిసి వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 12:20PM