హైదరాబాద్ : జమ్ముకాశ్మీర్ కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. బుల్లెట్ గాయాలైన ఇద్దరు సైనికులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం శాంప్సిపొర రహదారి సమీపంలో భద్రతా దళాలను చూసి ముష్కరులు దాడికి తెగబడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని నిర్బంధించి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm