హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ప్రధాన అనుచరుడు నాగార్జున సాగర్ కాలువలో గల్లంతయ్యారు. ఖమ్మం నగరంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లి కాంగ్రెస్ నేత రవి.. గల్లంతైనట్టుగా చెబుతున్నారు. రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఆయన.. పర్సనల్ అసిస్టెంట్ గా కూడా పనిచేస్తున్నాడు.. దాదాపుగా 11 కిలోమీటర్లు కూడా ఏకధాటిగా ఈత కొట్టడంలో రవి నిష్ణాతుడిగా చెబుతున్నారు.. అయితే, ఈ రోజు ఉదయం సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లిన రవికి హార్ట్ స్ట్రోక్ రావడంతో గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు.. మరోవైపు.. రవి కోసం సాగర్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, స్థానికులు.. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm