హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఆమె శిక్షా కాలం ముగియడంతో ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. శశికళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆమె పల్స్ రేటు నిమిషానికి 76గా, బీపీ 166/86గా ఉందని బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె ఈ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకునే అవకాశాలూ లేకపోలేదు. ఆమెను అధికారులు విడుదల చేసిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆమె బంధువులు భావిస్తున్నారు. మరోవైపు, ఇంటి వద్దే చికిత్స అందిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm