హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస గ్రామ సమీపంలో గొర్రెలను తీసుకువెళ్తున్న ఓ వ్యాన్ అతివేగంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, 70 గొర్రెలు మృతి చెందాయి. గూడూరు నుంచి మధిరకు డీసీఎం వ్యాన్‌లో గొర్రెలను తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm