హైదరాబాద్: మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. చిన్న చిన్న విషయాలకే ఒకరితో ఒకరు గొడవపడి ఏకంగా చంపుకునే వరకు వెళుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫోన్ ఇవ్వలేదనే కోపంతో ఓ కూతురు ఏకంగా తన తండ్రిని కొట్టి చంపిన ఘటన గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే.. బిలాస్‌పూర్ జిల్లాలోని కంచన్‌పూర్ గ్రామంలో రామ్ ధనుహర్ భార్యతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 23న ఆయన కూతురు సరస్వతిని ఆమె భర్త ధనుహర్ ఇంట్లో వదిలివెళ్లాడు. ఆ మరుసటి రోజు తన ఫోన్ గురించి వెతికిన సరస్వతి తన తండ్రిని ఫోన్ గురించి అడిగింది. అయితే ముందు తనకు ఫోన్ గురించి తెలియదన్న ధనుహర్.. ఆ తరువాత ఆమె ఫోన్ తానే దాచిపెట్టానని అంగీకరించాడు.
తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందన.. ఆమెకు ఫోన్ ఇవ్వనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన కూతురు సరస్వతి.. ఫోన్ ఇవ్వాలని తండ్రిని చితకబాదింది. ఈ క్రమంలో ధనుహర్ చనిపోయాడు. దీంతో ఇంటి సమీపంలోనే అతడి శవాన్ని పాతిపెట్టారు. అయితే ఈ విస్తుగొలిపే ఘటనలో కూతురు సరస్వతికి ఆమె తల్లి కూడా సహకరించడం గమనార్హం. అనంతరం తల్లీకూతుళ్లు ఇల్లు వదిలి పారిపోయారు. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న ఇరుగు పొరుగు వాళ్లు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ధనుహర్‌ను హత్య చేసిన తల్లికూతుళ్లను అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 08:04AM