విజయనగరం: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, జిల్లా ఎస్పీ రాజకుమారి విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి జిల్లా యంత్రాంగం అంతా తూచా తప్పకుండా పాటించాలన్నారు. సున్నితమైన పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో సమర్ధవంతంగా నిర్వహించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm