విశాఖపట్నం: విశాఖ పాడేరులో సీఐటీయూ, గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని రైతుల ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్, నిత్యావసర ధరలు తగ్గించాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm