హైదరాబాద్: రాజేంద్రనగర్ మణికొండలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం సూపర్ మార్కెట్కు వెళ్లిన విద్యార్థిని సాయంత్రం వరకూ కూడా ఎంతకీ తిరిగి ఇంటికి రాక పోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికినప్పటికీ విద్యార్థిని ఆచూకీ తెలియకపోవడంతో తమ సమీప బంధువులకు ఫోన్ చేసి వాకాబు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm