హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం జరుపుకొంటున్న గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరయ్యే అవకాశం చేజారినందుకు బ్రిటన్ ప్రధాని.. విచారం వ్యక్తం చేశారు. అయితే, త్వరలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యావత్ భారత ప్రజానీకానికి ఆయన 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు.
భారత్‌లో జరిగే విశిష్ట వేడుకలకు(గణతంత్ర దినోత్సవం)..ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు హాజరవ్వాలని ఆసక్తిగా వేచిచూశాను. కానీ, కొవిడ్-19పై మనమంతా చేస్తున్న పోరాటం కారణంగా వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటూ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు. మానవాళికి పొంచి ఉన్న మహమ్మారి ముప్పు తొలగించేందుకు చేస్తున్న వ్యాక్సిన్ల తయారీలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయని తెలిపారు. త్వరలో కరోనాపై పోరులో విజయం సాధించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదేమైనా, భారత్‌తో పాటు బ్రిటన్‌లో గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న వారందరికీ శుభాకాంక్షలు అంటూ సందేశాన్ని ముగించారు బోరిస్ జాన్సన్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Jan,2021 12:21PM