హైదరాబాద్: ఎందుకొచ్చారో.., ఎవరు పంపారో తెలియదు. భార్యాపిల్లలతో బైక్ పై వెళ్తున్న యువకుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు. కట్టుకున్న భార్య, కన్నబిడ్డల ఎదుటే అతని హత్య చేశారు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోని వ్యక్తిని మర్డర్ చేయడానికి కారణాలేంటో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు. వివరాల్లోకి.., శ్రీకాకుళం జిల్లా భామిని మండలం, నేరడి(బి) పంచాయతీ, లోహరిజోల గ్రామానికి చెందిన నల్లకేపటి కుమారస్వామి ఊర్లో టైలరింగ్ పనిచేస్తుంటాడు. సోమవారం భార్యాపిల్లలతో కలిసి పర్లాఖెముండి వెళ్తున్నారు. ఈక్రమంలో దిమ్మిడిజోల, ఇసుకగూడ గ్రామల మధ్య వెళ్తుండగా బైక్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. కత్తులతో కుమారస్వామిపై విచక్షణారహితంగా దాడి చేశారు. మెడ, చాతీపై కత్తులతో పొవడంతో తీవ్రంగా గాయపడిన కుమారస్వామి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు హంతలకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకోని పారిపోయారు. ఘటవాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేర్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించి హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. మృతుడి భార్య సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కుమారస్వామి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుమార స్వామి గ్రామంలో టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో వేరే ప్రాంతానికి వలస వెళ్లిన అతడు మూడేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగివచ్చాడు. అతడికి ఎవరితోనూ గొడవలు లేవని స్థానికులు చెప్తున్నారు. కుమార స్వామి మర్డర్ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ఇచ్చిన వివరాల ఆధారంగా దిమ్మిడిజోల, ఇసుకగూడ గ్రామాలతో పాటు వారు వచ్చి వెళ్లిన దారిలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయోమో ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ దొరికితే హంతకులను సులభంగా పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అలాగే మృతుడి భార్య చెప్పిన వివరాల ఆధారంగా ఆవే పోలికల్లో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో నడిరోడ్డుపై మర్డర్ జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm