ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల దృష్ట్యా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm