హైదరాబాద్: కోళ్ల ధరలను నియంత్రించే సీఎంఆర్ సంస్థను తక్షనమే రద్దు చేసి రాష్ట్ర పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పౌల్ట్రీ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు వెంకట్‌రెడ్డి కోరారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణం మంజునాథ పక్షన్ హాల్ జరిగిన పౌల్ట్రీ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ సంస్థ ధరను నియంత్రించడం ద్వారా తాము నష్టపోతున్నామన్నారు. కరోనా కష్టకాలం నుంచి తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇప్పుడు మళ్లీ బర్ట్‌ఫ్లూ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్యపు ప్రచారాలతో మరింత నష్టపోయి దివాళా తీసే పరిస్థితికి వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఎక్కడా బర్ట్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని అధికారులే నిర్ధారించారని తెలిపారు. ప్రజలు గమనించి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో పౌల్ట్రీ రైతుల గౌరవాధ్యక్షుడు వేణుగోపాల్‌రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, రాజన్న సిరిసిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm