హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం తరపున అతిధులుగా పాల్గొంటున్న గిరిజనులు భూక్యా లక్ష్మీ , కాత్లే మారుతీ లకు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో షెడ్యూల్ తెగల ఏకత్వ స్పూర్తిని చాటేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాలకు ఒక మహిళ, ఒక పురుషున్ని గిరిజన ప్రతినిధులను అతిధులుగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఎంపికైన ప్రతినిధులు జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 02వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. మన రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా, గడ్డిగూడెం తండా నుంచి శ్రీమతి భూక్యా లక్ష్మీ , ఆదిలాబాద్ జిల్లా, చించుఘాట్ నుంచి శ్రీ కాత్లే మారుతీలు ఎంపిక కావడం అభినందనీయమని, గిరిజనులకు వీరు స్పూర్తిదాయకమని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహబూబాబాద్ జిల్లా , నడివాడ గ్రామంలోని మారుమూల గడ్డిగూడ తండాలోని లంబాడి గిరిజన తెగకు చెందిన శ్రీమతి భూక్యా లక్ష్మీ జీవితంలో ఎన్నో కష్టానష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డారు. స్వయం సహాయక బ్రుందంలో చేరి ఆర్ధికంగా నిలదొక్కుకొని తన పిల్లలను ఉన్నత చదువులు చదివించడమే కాకుండా తన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేశారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని నేడు భారత ప్రభుత్వ అతిధిగా ఎంపిక కావడం పట్ల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అభినందించారు.
తోటి గిరిజన తెగకు చెందిన శ్రీ కాత్లే మారుతీ ఆదిలాబాద్ జిల్లా లోని చించుఘాట్ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగారు. విద్యారంగంలో తన తెగను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో విద్యార్థులకు విద్యారంగంలో ఉన్న అవకాశాలను తెలియజేస్తే, అవి అందిపుచ్చుకునే మార్గాలను చెబుతూ, గ్రామంలో వైద్య వసతులు, ఇతర సమస్యలను తీర్చడానికి తన వంతు సాయం చేయడం.. నేడు అందరికీ స్పూర్తిదాయకమయ్యారన్నారు. గణతంత్ర దినోత్సవం.. నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిని తగిన విధంగా గౌరవించుకుంటుందని తెలిపారు. వీరిని స్పూర్తిగా తీసుకుని గిరిజనులందరూ వారి చుట్టూ ఉన్న సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:32PM