హైదరాబాద్ : నగరంలో షేర్ లింగంపల్లిలో తొర్రూరు డాక్టర్ సోమేశ్వరరావు కుమారుడి నెక్సాస్ ఆస్పత్రిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ లోని వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన హాస్పిటల్ ని ప్రారంభించిన డాక్టర్ సోమేశ్వరరావు, అతడి కుమారుడు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. హాస్పిటల్ బాగా నడవాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ నిర్వహణ బాగుండాలని, హాస్పిటాలిటీ ని బట్టే పేషంట్లు వస్తూంటారని, కేవలం వ్యాపార దృక్పథమేగాక, కాస్త సేవా తత్పరతతో వైద్యాన్ని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, డాక్టర్ సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm