హైదరాబాద్ : చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాకు చెందినదిగా అనుమానంతో చిత్తు కాగితాలు ఏరుకొనే ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేసిన ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. గరియాబాద్ జిల్లా రాజీ గ్రామంలో ఓ మహిళ చెత్త ఏరుకుంటూ అనుమానాస్పదంగా తిరుగుతోంది. స్థానికులు వ్యక్తిగత సమాచారం అడుగగా.. ఆమె స్పందించలేదు. దీంతో, ఆమెపై దాడి చేశారు అని పోలీసులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేర్పించగా.. సదరు మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకే పేరు వెల్లడించలేకపోయిందని వైద్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm