అమరావతి: ఆర్టీసీ బస్సును బైకు ఢీకొనడంతో తండ్రీకుమారుడు మృతిచెందిన ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నలుగురు కుటుంబ సభ్యులు ఒకే ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బద్వేలు- మైదుకూరు ప్రధాన మార్గంలోని ఓం చెరువు వద్ద ప్రమాదం జరిగింది. లారీని అధిగమించబోయి ముందు వస్తున్న బస్సును బైకు ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైకుపై ఉన్న మృతుడి భార్య సుగుణ, మరో కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిపల్లికి చెందిన రామిరెడ్డి, అతని కుమారుడు ఉమేశ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను కడప సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm