హైదరాబాద్ : రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్ లా కళాశాల మంజూరైంది. లా కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. 60 సీట్లతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు కళాశాల మంజూరయింది. వాటిలో ఎస్టీ- 39 సీట్లు, ఎస్సీ- 6, బీసీలకు 7 సీట్లు కేటాయించారు. రెండో విడత లా కౌన్సిలింగ్‌లో సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మంత్రి సత్యవతి రాఠోడ్కు కళాశాల మంజూరు పత్రాలను అధికారులు అందించారు.
Mon Jan 19, 2015 06:51 pm