హైదరాబాద్ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పంజాబ్ రైతు వినూత్నంగా ఆలోచన చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు.. ప్రధాని నరేంద్ర మోడీ తల్లికి ఓ భావోద్వేగ లేఖ రాశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేలా మీ అబ్బాయి మనసు మార్చండి అంటూ ఆ లేఖలో రైతు కోరారు. ఓ తల్లిగా తనకున్న అధికారాలన్నింటినీ ఉపయోగించుకొని మోడీ మనసు మార్చుతారని ఆశిస్తున్నా అని ఆ రైతు చెప్పడం గమనార్హం.
హర్‌ప్రీత్ సింగ్.. మోడీ తల్లి హీరాబెన్‌కు రాసిన లేఖలో ఈ చట్టాలను ఎందుకు రద్దు చేయాలో వివరించారు. తాము ఎలాంటి వాతావరణంలో ఆందోళన నిర్వహిస్తున్నామో చెప్పారు. చాలా బరువైన హృదయంతో ఈ లేఖ రాస్తున్నాను. కడుపు నింపే అన్నదాతను ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ రోడ్లపై పడుకునేలా చేస్తున్నారు. ఈ ఆందోళనలో 90-95 ఏళ్ల వయసు వాళ్లు కూడా ఉన్నారు. పిల్లలు, మహిళలూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది చనిపోయారు. అదానీ, అంబానీ, కార్పొరేట్లకు మేలు చేసేలా ఈ చట్టాలను రూపొందించారు అని ఆ రైతు లేఖలో వివరించారు. ఎన్నో ఆశలతో ఈ లేఖ రాస్తున్నాను. మీ అబ్బాయి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని. ఆయన ఈ చట్టాలను రద్దు చేయగలరు. నాకు తెలిసి ఎవరూ తల్లి మాటను కాదనరు అని ఆ రైతు లేఖలో రాశారు. ఓ తల్లే తన కొడుకునే ఆదేశించగలదని, ఆ పని చేస్తే దేశం మొత్తం మీకు కృతజ్ఞతలు చెబుతుంది అని హర్‌ప్రీత్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2021 01:48PM