హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పన్నుల వసూళ్లలో బిజీగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో పెరుగతున్న పెట్రో ధరలపై ఆగ్రహం వ్యక్తి చేసారు రాహుల్ గాంధీ. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే.. వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగు సార్లు పెరిగాయని దీంతో.. దేశంలో రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరాయని అన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. జీడీపీ, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల్లో మోడీజీ విపరీతమైన వృద్ధిని సాధించారని ఎద్దేవా చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm