హైదరాబాద్ : కర్నూలుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన నిడ్జూరులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుల వివరాలను వెల్లడించారు. మృతులు ఆర్.కొంతలపాడుకు చెందిన బీటెక్ విద్యార్థులు శివ, మురళిగా పోలీసులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm