హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లికి బయపడి ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్నేహితుడి ఫోన్‌తో ఆడుకుంటుండగా అది ఒక్కసారిగా కిందపడి పగిలిపోయింది దీంతో తన తల్లి తిడుతుందేమోనని భయపడిన ఆ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. మియాపూర్ ఠాణా పరిధిలోని న్యూ కాలనీలో అనిల్, సంగీత దంపతులు కూతురు అనిత(14)తో కలిసి ఉంటున్నారు. అనిత 6వ తరగతి చదువుతుంది. కాగా అనిత శనివారం సాయంత్రం స్నేహితుడి ఫోన్‌తో ఆడుతుండగా ప్రమాదవశాత్తు అది చేతిలో నుంచి కిందపడి పగిలిపోయింది. ఈ విషయమై బాలిక, ఆమె స్నేహితుడి మధ్య గొడవ జరిగింది. దీనిపై స్నేహితుడు తన తల్లికి ఫిర్యాదు చేయడంతో తనను కొడుతుందేమోనని భయపడింది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఇంటికి చేరుకున్న తల్లికి కూతురు వేలాడుతూ కనిపించగా స్థానికుల సాయంతో కిందకు దించి సమీపంలోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm