హైదరాబాద్ : ఏపీలోని రాజమండ్రి రాజానగరం దుర్గమ్మ గుడి సమీపంలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజాయి పట్టుబడింది. నర్సీపట్నం నుంచి హైదరాబాద్ కు స్విఫ్ట్ కార్, హైసెర్ వ్యానులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారుగా రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm