హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ళ విజయ కాలేజ్ సమీపంలో ద్వీచక్ర వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. దీంతో ద్వీచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న తిరువూరుకి చెందిన వీరమళ్ళ ఉదయ్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm