హైదరాబాద్ : ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతినిచ్చారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ల పరేడ్ ద్వారా తమ నిరసన తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అయితే, ఇందుకు తొలుత ఇందుకు నిరాకరించిన పోలీసులు ట్రాక్టర్ల సంఖ్యపై పరిమితి విధించాలని భావించారు. కానీ రైతులతో చర్చల అనంతరం తాజాగా అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm