Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 23 Jan,2021 07:55PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్ లో పంచాయతీ రాజ్ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంద్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల్గొన్నారు. ప్ర‌త్యేక ఆహ్వానితులుగా హాజ‌రైన రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్ శాఖ‌ల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, ప్రొహిబిష‌న్, ప‌ర్యాట‌క‌, క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసు శాఖ‌ల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, అలాగే ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణమ్మ, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహేశ్వ‌ర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, కలెక్టర్ వెంకట్రావు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్, డిఆర్డిఓ, డిపిఓ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆయా స‌మావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ నేతృత్వంలో స్థానిక సంస్థ‌లు బ‌లోపేతం అయ్యాయ‌య‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా స్థానిక సంస్థ‌ల‌కు ప్ర‌తి నెలా రూ.308 కోట్లు ఇస్తున్న ఘ‌త‌న సీఎం కెసిఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌తి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం. ఇంటింటికీ న‌ల్లా క‌నెక్ష‌న్ల ద్వారా ప‌రిశుభ్ర‌మైన‌, ఆరోగ్య‌వంత‌మైన, శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామ‌ని చెప్పారు. అలాగే ప్ర‌తి ప‌ల్లెకు న‌ర్స‌రీలు, త‌డిపొడి చెత్త‌ను వేరు చేసే డంపింగ్ యార్డులు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, వైకుంఠ ధామాలు నిర్మిత‌మ‌వుతున్నాయ‌ని అన్నారు. అలాగే రైతుల ఆత్మగౌర‌వం పెంపొందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌ రైతు క‌ల్లాలు, రైతుల‌ను సంఘ‌టిత ప‌రిస్తూ, చైత‌న్యం చేసే విధంగా 2,601 రైతు వేదిక‌లు నిర్మిత‌మ‌య్యాయ‌ని మంత్రి వివ‌రించారు. ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ప‌ల్లెల రూపు రేఖ‌ల‌నే మార్చేసింద‌ని మంత్రి తెలిపారు. నిత్యం జ‌రిగే పారిశుద్ధ్యం ప్ర‌జ‌ల‌ను అంటు, సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి కాపాడింద‌ని, క‌రోనా వంటి మ‌హ‌మ్మారిని సైతం ఎదురించే విధంగా మార్చింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. అలాగే, ప్ర‌తి గ్రామంలోనూ అంత‌ర్గ‌త సిసీ రోడ్లు, గ్రామాల మ‌ధ్య లింకు రోడ్లు వేస్తున్నామ‌ని చెప్పారు.  త‌న సుదీర్ఘ 40 ఏండ్ల రాజ‌కీయ, ప్ర‌జాప్రాతినిధ్య జీవితంలో ఏనాడూ ప‌ల్లెల్లో ఈ స్థాయి అభివృద్ధిని చూడ‌లేద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి స‌భికుల క‌ర‌త‌ళా ధ్వ‌నుల మ‌ధ్య వివ‌రించారు. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా మిష‌న్ భ‌గీర‌థ‌కు, న‌ల్లా క‌నెక్ష‌న్ల‌కు, ఫ్లోరైడ్ ర‌హిత నీటి స‌ర‌ఫ‌రాకు, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు స్వ‌చ్ఛ అవార్డులు ఇలా అనేకానేక అవార్డులు, రివార్డులు, ప్ర‌శంస‌లు వ‌స్తూనే ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు. నూటికి నూరు శాతం న‌ల్లాల క‌నెక్ష‌న్లు ఇచ్చిన రాష్ట్రంగా నిన్న‌నే కేంద్ర మంత్రి ప్ర‌క‌టిచారని మంత్రి స‌భికుల క‌ర‌త‌ళా ధ్వ‌ర‌నుల మ‌ధ్య ప్ర‌క‌టించారు. అలాగే దేశ వ్యాప్తంగా మ‌న స్కీములే అమ‌లు అవుతున్నాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. ‌మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం జ‌ల్ మిష‌న్ పేరుతో  కేంద్రం అమ‌లు చేస్తున్న‌ది, జ‌ల్ స్వ‌ప్న పేరుతో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఇంకా బీహార్ వంటి అనేక రాష్ట్రాలు య‌థాత‌థంగా ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాయ‌న్నారు.  ప‌ల్లెలు అంటేనే రైతుల‌ని, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, స‌కాలంలో విత్త‌నాలు, ఎరువులు, పంట‌ల కొనుగోలు, రుణాల మాఫీ, సాగునీరు, 24 గంట‌ల ఉచిత‌ విద్యుత్.... ఇలా అనేకానేక ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్ర‌మేన‌ని మంత్రి వివ‌రించారు.  ఇక సర్పంచ్ ల బాధలు నాకు తెలుసు... సర్పంచ్ లకు గతంలో ఎప్పుడూ లేనంతగా మంచి పేరు వచ్చింది. సర్పంచ్ లు కష్టపడితే ప్రభుత్వానికి పేరు వచ్చింది...టీం వర్క్ చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి అనేక అవార్డ్ లు వచ్చాయి.. గతంలో గ్రామాల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలి... అంటూ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్రతినిధుల‌కు గుర్తు మంత్రి చేశారు. కొంద‌రు స‌ర్పంచ్ లు ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేయమంటున్నారు. అది చట్టంలో ఉన్నది...సాధ్య సాధ్యాలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పరిశీలిస్తాం... అని మంత్రి తెలిపారు. సర్పంచ్ ల జీతం పెంపు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతాం అన్నారు. ఇక త్వరలోనే కొత్త పెన్షన్ లు ఇచ్చేందుకు కృషి చేస్తామ‌ని మంత్రి తెలిపారు.
మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. మ‌న‌మంతా రైతు కుటంబాల నుంచే వ‌చ్చాం. ఇంత కరోనా క‌ష్ట కాలంలోనూ రైతు బంధు అంద‌చేస్తున్నాం. రైతుల‌కు రైతు బీమా చేస్తున్నాం అన్నారు. స్థానిక సంస్థ‌లు బ‌లోపేతం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా పంచాయ‌తీల‌కు డ‌బ్బులు ఇస్తున్న సంగ‌తిని మంత్రి గుర్తు చేశారు. దీంతో ప్ర‌తి గ్రామ పంచాయ‌తీలో ప్ర‌తి నెలా.. క‌నీసం రూ.5ల‌క్ష‌ల నుంచి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు నిధులు నిలువ వుంటున్నాయ‌ని మంత్రి తెలిపారు. గ‌తంలో స‌ర్పంచ్ ల ప‌రిస్థితి దారుణంగా ఉండేద‌ని, ఇప్పుడా ప‌రిస్థితుల‌ను మార్చివేసి, స్థానిక సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేసి, నిధులు ఇస్తూ, గ్రామాల‌ను అన్ని విధాలుగా, అమ‌లు చేస్తున్న ఘ‌న‌త సీఎం కెసిఆర్ దేన‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి వివ‌రించారు.
మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ మాట్లాడుతూ.., గ‌తంలో గ్రామాల్లో నీటి స‌మ‌స్య‌లు బాగా ఉండేవి. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంతో ఇప్పుడా స‌మస్య‌లు పోయాయి. స‌ర్పంచ్ లు సొంత డ‌బ్బులు ఖ‌ర్చు చేసినా, ప‌ద‌వీ కాలం మొత్తం నీటి స‌ర‌ఫ‌రాకే స‌రిపోయేవి. డంపింగ్ యార్డులు, స్మ‌శాస‌న వాటికలు‌, న‌ర్స‌రీలు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు...గ్రామాల్లో కనీస అవ‌స‌రాల‌కు ట్రాక్ట‌ర్లు ఇచ్చింది కెసిఆర్ ప్ర‌భుత్వ‌మ‌ని వివ‌రించారు. విద్యుత్ స‌మ‌స్య‌లు పోవ‌డంతో రైతుల్లో ఆనందోత్సాహాలు క‌లుగుతున్నాయ‌న్నారు. ఇంత‌గా గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌లేద‌ని తెలిపారు. స్థానిక సంస్థ‌ల బ‌లోపేతానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందని మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ వివ‌రించారు.

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి
ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి
ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి
ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:59 PM అదే జరిగితే 100 ఏళ్లు వెనక్కిపోతా: హరీశ్ రావు
09:48 PM రెండో డోసు తీసుకున్నాక డాక్టర్ కు కరోనా
09:29 PM ఈ నెల 15 త‌ర్వాత తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు
09:15 PM మహా­రా­ష్ట్రలో 10,187 కరోనా కేసులు నమోదు
09:09 PM ఎన్నికల్లో బీజేపీకి యువత సరైన సమాధానం చెప్పాలి : కేటీఆర్
08:51 PM బస్సులో మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు
08:35 PM బాంబు‌ పేలుడు.. 20 మంది మృతి
08:29 PM మనిషి అలికిడి లేక.. ఆవిష్కరణ
08:14 PM దేవాలయాలపై దాడుల వెనుక ఉన్నది హిందుత్వవాదులే : ఒవైసీ
08:08 PM తహసీల్దార్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న మహిళా రేషన్‌ డీలర్
07:33 PM బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు తీవ్ర అస్వస్థత..
07:26 PM ఫొటో చూసి ఓకే చెప్పింది..ప్రత్యక్షంగా చూసి పారిపోయింది
07:16 PM అనంతపురం జిల్లా సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం
07:13 PM బాలుడిపై మహిళ లైంగికదాడి.. గర్భవతి
06:33 PM ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య
06:24 PM విశ్వాస పరీక్షలో నెగ్గిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
05:54 PM భర్తను కోల్పోయిన టీచర్ కు స్టూడెంట్ రాసిన లెటర్.. వైరల్
05:48 PM ఏపీలో కొత్తగా 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
05:22 PM దేశంలో ఒక్క‌రోజే 15 లక్ష‌ల మందికి టీకాలు
05:18 PM 100 కోట్ల క్లబ్బులో 'ఉప్పెన'..
05:01 PM ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి
04:33 PM శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్
04:31 PM తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్
04:24 PM మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్
04:13 PM భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం
04:08 PM గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
04:02 PM హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..
03:55 PM ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం
03:45 PM బీడీ కార్మికుల ధర్నా
03:27 PM బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)
02:58 PM కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత
02:44 PM విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..
02:10 PM కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్
01:56 PM ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు
01:36 PM శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌
01:21 PM ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్
01:15 PM నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
01:02 PM పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య
12:48 PM రాజేంద్రనగర్‌లో వివాహిత ఆత్మహత్య
12:21 PM టీడీపీ సీనియ‌ర్ నేత‌ కన్నుమూత
12:13 PM బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం
12:00 PM నేడు విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్న పాక్ ప్రధాని
11:40 AM టీమిండియా 365 పరుగులకు ఆలౌట్
11:36 AM హాస్పి‌ట‌ల్ బిల్లు‌లు క‌ట్ట‌లేద‌ని పాప‌కు స‌ర్జ‌రీ చేసి కుట్లు వేయ‌కుండా..!
11:07 AM మేయర్ నుంచి ప్రాణహాని ఉందంటూ టీఆర్ఎస్​ నేత సంచలన వ్యాఖ్యలు
11:01 AM బ‌డ్జెట్ స‌మావేశాల‌పై నేడు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌!
10:40 AM తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త
10:24 AM భార‌త్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు
09:33 AM రిషభ్ పంత్ పీట్‌ను చూసి షాకైన కోహ్లి
09:14 AM నేడు ఢిల్లీ కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధనం
08:54 AM బంగారంపై లోన్ తీసుకునే వారికి ఎస్‌బీఐ బంపరాఫర్..!
08:45 AM ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ కన్నుమూత
08:37 AM నిర్మల్‌లో గుప్తనిధుల తవ్వకాల కలకలం
08:32 AM లడఖ్‌లో స్వల్ప భూకంపం
08:24 AM హైద‌రాబాద్‌లో దారుణం...
08:16 AM నేడు ఎంసెట్ కమిటీ సమావేశం
07:57 AM యువతిపై నెలరోజులపాటు 60 మంది లైంగికదాడి!
07:43 AM సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో అగ్ని ప్రమాదం
07:39 AM రూ.13 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన సర్పంచ్
07:25 AM నగరంలో అర్ధరాత్రి రౌడీషీటర్‌ వీరంగం
06:55 AM సీఎం జగన్‌పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యా‌ఖ్య‌లు
06:40 AM భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం!
06:36 AM మాజీ కార్పొరేటర్‌ జయరాంరెడ్డి మృతి
06:34 AM న‌లుగురిని ప్రేమించి వారితో వెళ్లిపోయిన యువతి..!
09:56 PM కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
09:45 PM జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత
09:36 PM తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం
09:07 PM బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం
08:56 PM ఏసీబీ వలలో సర్పంచ్..!
08:32 PM పరిటాల శ్రీరామ్‌పై కేసు
08:23 PM రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!
08:16 PM తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్
08:09 PM విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
07:37 PM మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు
07:26 PM విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!
07:13 PM అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్
07:12 PM బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
06:35 PM ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు
06:32 PM భారీగా తగ్గిన బంగారం ధరలు
06:26 PM టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
06:08 PM బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌
06:03 PM ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే
05:57 PM కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం
05:42 PM ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం
05:22 PM వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్
05:02 PM బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
04:53 PM వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ
04:44 PM ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ
04:34 PM భర్తకు షాకిచ్చిన భార్య!
04:23 PM భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
04:21 PM కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్
04:12 PM ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌
03:47 PM షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
03:39 PM జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి
03:24 PM సరిహద్దుల్లో భారతీయుడిని కాల్చి చంపిన నేపాల్​ పోలీసులు
01:50 PM ఓటర్లకు బంగారు ముక్కుపుడకలు...
01:24 PM నాలుగో టెస్టు : కష్టాల్లో భారత్..
01:18 PM వాట్సప్‌ యూజర్లకు శుభవార్త
12:56 PM మహిళలకు ఏపీ సర్కార్‌ శుభవార్త
12:42 PM జగిత్యాల జిల్లాలో వ్యక్తికి కొత్త రకం కరోనా

Top Stories Now

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)
ఫొటో చూసి ఓకే చెప్పింది..ప్రత్యక్షంగా చూసి పారిపోయింది
మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్
భర్తను కోల్పోయిన టీచర్ కు స్టూడెంట్ రాసిన లెటర్.. వైరల్
బాలుడిపై మహిళ లైంగికదాడి.. గర్భవతి
బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు తీవ్ర అస్వస్థత..
గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఎస్‌బీఐ బంపరాఫర్..!
రోడ్డుపై ప‌సిబిడ్డ మృత‌దేహాన్ని పీక్కు‌తింటున్న కుక్క‌లు
యువతిపై నెలరోజులపాటు 60 మంది అత్యాచారం
రూ.13 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన సర్పంచ్
భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం!
న‌లుగురిని ప్రేమించి వారితో వెళ్లిపోయిన యువతి..!
బట్టతలను దాచిన భర్తకు షాకిచ్చిన భార్య!
నేడు ఎస్‌బీఐ మెగా ఈ-వేలం.. అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ టైమింగ్ మార్పు..
మేయర్ ఇంట్లో కుక్కలా పుడతా..!
భారీగా తగ్గిన బంగారం ధరలు..
మరో వివాదంలో చిక్కుకున్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
కరీంనగర్ జిల్లాలో దారుణం..
నాని చిత్రానికి షాకిచ్చిన ప్రముఖ మోడల్..

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.