హైదరాబాద్ : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ నేడు జైలు నుంచి విడుదలైంది. కిడ్నాప్ కేసులో ఆమెకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొద్దిసేపటి కింద అఖిలప్రియ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా అఖిలప్రియకు కోర్టు కొన్ని షరతులు విధించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి బోయిన్ పల్లి పోలీసుల ఎదుట హాజరవ్వాలని స్పష్టం చేశారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1 నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm