హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం చౌట్‌పల్లిలో పసుపు రైతులతో అర్వింద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, రూ.15 వేలు మద్దతు ధర ఇప్పిస్తానని, తానెక్కడా చెప్పలేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని మాత్రమే చెప్పానని అర్వింద్ తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మాట్లాడకుండా విషయాన్ని పక్కదారి పట్టేంచేలా అర్వింద్ మాట్లాడుతున్నారంటూ పసుపు రైతుల ఆందోళన చేశారు. మోసం చేశారంటూ ఆయనను పసుపు రైతులు నిలదీశారు. పసుపు పంటకు రూ. 15000 కనీస మద్దతు ధర కల్పిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. దీంతో ఎంపీ వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎంపీ పదవికి అర్వింద్ రాజీనామా చేయాలని పసుపు రైతుల డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm