హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు బీ. కొండా రెడ్డి ఆధ్వర్యంలో రేపు(24 జనవరి 2021) సాయంత్రం 4గంటలకు ఆన్లైన్ జూమ్ వెబినార్ ద్వారా సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వెబినార్ లో ముఖ్య వక్తలుగా తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఏ. నర్సింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఛైర్మన్ జీ. రామా రావు, కేరళ బార్ కౌన్సిల్ ఛైర్మన్ కె. పి. జయ చంద్రన్, కర్ణాటక బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎల్. శ్రీనివాస్ బాబు, తమిళనాడు బార్ కౌన్సిల్ చైర్మన్ పి. అమల్ రాజ్ పాల్గొననున్నట్లు కొండా రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm