హైదరాబాద్: తమిళనాడులో రూ.7కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు కార్పొరేషన్ పరిధిలో జనం రద్దీగా ఉండే బాగలూరు రహదారిలో నిర్వహిస్తున్న కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులో రూ.7 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదును పట్ట పగలు దొంగలు దోచుకెళ్లారు. శుక్రవారం ఉదయం ముసుగు వేసుకున్న ఆరుగురు దొంగలు వచ్చి సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించి ఫైనాన్స్ ఆఫీసు లోపలికి ప్రవేశించి మూడు వేల సవర్ల బంగారు నగలను, రూ.95 వేల నగదును మూటగట్టి దోచుకెళ్లారు. అనూహ్యంగా ఈరోజు ఉదయం దోపిడీ ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, నగదు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm