హైదరాబాద్ : చెడు అలవాట్లకు బానిసై, దొంగతనాలకు అలవాటు పడ్డ ఇద్దరు నిందితులను రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆటోలు నడుపుతూ దొంగతనాలు ఎంచుకున్నారు. రాత్రి సమయంలో ప్రధాన రహదారుల్లో వెళ్లే ప్రయాణికులను, నడుచుకుంటూ వెళ్లే వ్యక్తులను మొదట వీరు వెంబడిస్తారు. అదును చూసి వారిని భయపెట్టి వారి వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్లు లాక్కుంటారు. ఇదీ వారి దొంగతనాలు స్టైల్. దొంగిలించిన ఫోన్లను అమ్మి జల్సాలు చేస్తారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm