ముంబై: దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసెంజర్లు అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాల్ రమేష్ ఒబెరాయ్(35) అనే వ్యక్తి, తారానమ్ ఖాన్ అనే మహిళ అక్రమంగా 2.7 కేజీల బంగారాన్ని దుబాయి నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. గ్రీన్ చానల్ ద్వారా నిందితులిద్దరూ వెళ్లేందుకు ప్రయత్నించడంతో అధికారులకు వారిపై అనుమానం కలిగింది. వెంటనే వారి లగేజ్‌ను చెకింగ్ చేయగా బంగారం బయటపడింది. బట్టల మధ్య బంగారాన్ని దాచినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం విలువ దాదాపు 1.2 కోట్లు ఉండొచ్చని తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్లో విశాల్ రమేష్ అనే వ్యక్తి దగ్గర మారిషస్ పాస్‌పోర్ట్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిందితులను కస్టమ్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్టు అధికారులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm