న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు, ఇవాళ మరో 25 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీతోపాటు, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరాయి.
తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ వివరాలు...
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ - రూ.85.70, డీజిల్ - రూ.75.88కు చేరింది.
ముంబైలో పెట్రోల్ - రూ. 92.28, డీజిల్ రూ.82.66కు చేరింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ - రూ.89.15, డీజిల్ రూ. 82.80కు చేరింది.
బెంగళూరులో పెట్రోల్ రూ.88.59, డీజిల్ రూ.80.47కు చేరింది.
చెన్నైలో పెట్రోల్ రూ.88.38, డీజిల్ రూ.82.23,
కోల్‌కతాలో పెట్రోల్ రూ.87.11, డీజిల్ రూ.79.48కి చేరాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2021 09:59AM