హైదరాబాద్: దాణా కుంభకోణంలో జైలుశిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాంచీలోని రిమ్స ఆస్పత్రికి ఆయన కుటుంబసభ్యులు చేరుకుంటూన్నారు. ఆయన కుమార్తె మీసా భారతి శుక్రవారం ఆసుపత్రికి చేరుకున్నారు. చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, లాలూ భార్య రబ్రీ దేవి పట్నా నుంచి ఛార్టెడ్ విమానంలో బయలుదేరి ఆసుపత్రిలో లాలూను కలిశారు. చాలాకాలంగా పలురకాల వ్యాధులతో లాలూ బాధపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm