హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ హనుమాన్ పేట బైపాస్ వద్ద దారుణం జరిగింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని బావ గఫార్‌ను బావమరిది సలీం హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు ముత్తిరెడ్డికుంట వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm