హైదరాబాద్: కన్నడ భామ రష్మిక మందన్నకు తెలుగులో మంచి ఫాలోయింది. తొందర్లనే ఈ శాండిల్ వుడ్ బేబి.. బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోల ఫేవరేట్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి రష్మికకు తాజాగా అనుకోని షాక్ తగిలింది. ప్రస్తుతం రష్మిక చేతిలో అల్లు అర్జున్,.. ‘పుష్ప’ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.అటు శర్వానంద్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. దాంతో పాటు పలు కన్నడ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో బీ టౌన్‌లో కూడా సత్తా చూపెట్టాలని చూస్తోంది. తాజాగా ఈ భామకు అనుకోని షాక్ తగిలింది. అది కూడా గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నుంచి. ఎలా అని ఆశ్యర్యపోతున్నారా.. రీసెంట్‌గా రష్మిక మందన్నకు సూర్య సరసన ఓ సినిమాలో బంపరాఫర్ వచ్చింది. తీరా షూటింగ్ మొదలయ్యే టైమ్‌కు రష్మిక ప్లేస్లో ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారు. సడెన్‌గా ఎంతో క్రేజ్ ఉన్న రష్మికను ఈ సినిమా నుంచి తప్పించడానికి పెద్ద రీజనే ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం రష్మిక డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఆమె చెప్పిన పారితోషకం ఎక్కువగా ఉండటంతో వెంటనే రష్మికను తప్పించిన ఆమె ప్లేస్‌లో ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారు. మొత్తంగా పూజా హెగ్డేతో సమానంగా తెలుగులో అవకాశాలు కొల్లగొడుతున్న రష్మికకు ఇపుడు ఓ అప్ కమింగ్ హీరోయిన్ షాకివ్వడాన్ని కోలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm