ముంబై: అగ్నిప్రమాదానికి గురైన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ప్లాంట్‌ను ఫోరెన్సిక్ బృందం శుక్రవారం సందర్శించింది. మహారాష్ట్ర పూణేలోని మంజరి ప్లాంట్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంపై ఆరా తీసింది. మంటల వ్యాప్తికి కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు కోసం కొన్ని నమూనాలను సేకరించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొత్తగా నిర్మిస్తున్న భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు నిర్మాణ కార్మికులు మరణించగా పలువురు గాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm