హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం అల్మాస్ పూర్ లో దళితులను కులం పేరుతో దూషించి వృద్ధులని చూడకుండా భౌతిక దాడికి పాల్పడిన బీజేపీ గుండాలను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు కేవిపిఎస్ రాష్ట్ర ఆధ్యక్షకార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్, టి స్కైలాబ్ బాబు లు ఒక ప్రకటన విడుదల చేశారు. వారు మాట్లడుతూ అల్మాస్ పూర్ గ్రామమలో ఆర్ ఎస్ ఎస్, బీజేపీకి చెందిన అగ్రకుల పెత్తందారులు పచ్చని పల్లెల్లో చిచ్చులు పెట్టె విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రామాలయం, శివాజీ విగ్రహాల మాటున దళితులు బలహీనవర్గాలపై బౌతికదాడులకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రోద్బలంతోనే కొంత మంది యువకులు రెచ్చిపోతు పల్లెల్లో చిచ్చులు పెడుతున్నారని విమర్శించారు. అల్మాస్ పూర్ లో కమ్యూనిటీ హాల్ వివాదంపై మాట్లాడుదాం రమ్మని పిలిచి కులం పేరుతో దూషించి దళిత వృద్ధుడైన మునిగే నర్సయ్యను కాలర్ పట్టి దుర్భాశలాడరని చెప్పారు. కొంత మంది దళిత యువకులపై బౌతికదాడులు చేసి జైశ్రీరాం జై మోడీ అంటూ నినాదాలు చేయడం దుర్మార్గమని చెప్పారు. బీజేపీ నాయకుడు శరత్ రెడ్డి నాయకత్వంలో 35మంది ఈ దాడిలో పాల్గొన్నారని వారందరి పై ఎస్సి ఎస్టీ కేసుతోపాటు హత్యానేరం కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కేవిపిఎస్ నేతలు డిమాండ్ చేశారు. రాముడు దళితులపై దాడులు చేయమని చెప్పాడా?ఎందుకు ఈ దాడులకు పాల్పడుతున్నారో బీజేపీ నేత బండి సంజయ్ బదులివ్వాలని కేవిపిఎస్ డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 Jan,2021 03:37PM