హైదరాబాద్ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్ లో దాదాపు 20 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. భేటీ సందర్భంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో పిటిషన్, ఎన్నికల ప్రక్రియ, ఎలెక్షన్ షెడ్యూల్ తదితర వివరాలను గవర్నర్ కు ఎస్ఈసీ వివరించారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ధర్మాసనం తొలగించిన విషయం గురించి చెప్పారు. పంచాయతీ ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఎన్నికలకు సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కరోనా వ్యాక్సినేషన్ కు ఆటంకాలు లేకుండా, ప్రజలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఎన్నికలను నిర్వహిస్తామని గవర్నర్ కు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm