హైదరాబాద్ : ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓవైపు ఆ వ్యాధితో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు, అదే జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లిలోనూ ఆ వింత వ్యాధి బారిన పలువురు పడ్డారు. కొమిరేపల్లిలో 13 మంది అస్వస్థతకు గురికాగా వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి బాధితుల వద్దకు వచ్చి, పరిస్థితిపై ఆరా తీశారు. మొదట మూర్చ వచ్చి బాధితులు పడిపోతున్నారని స్థానికులు తెలిపారు. వింత వ్యాధి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామంలోనూ ఈ వింత వ్యాధి బాధితుల సంఖ్య మరింత పెరిగింది. కొందరు స్పృహ తప్పి పడిపోతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm