హైదరాబాద్ : యూపీలోని నోయిడాలోని సెక్టార్ 63లో బాంబు కలకలం సృష్టించింది. ప్రయివేటు ఆస్పత్రి వద్ద ఈరోజు తెల్లవారుజామున బాంబు లభ్యమైంది. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబు ఉందని తెలియడంతో రోగులు తీవ్ర భయాందోనళకు గురయ్యారు. అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్, పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. బాంబు ఎవరు పెట్టి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm