హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్, డీజిల్ ధరల పెంపు, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాలతో ఛార్జీల పెంపునకు ముఖ్యమంత్రికి అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఛార్జీలు పెంచితే ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం పెరుగుతుందని.. బస్సు ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm